- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి బనకచర్ల ప్రాజెక్టు వల్ల వరంగల్ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం : పెద్ది సుదర్శన్ రెడ్డి
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

దిశ, హనుమకొండ : గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెకిలి మాటలుగా అభివర్ణిస్తూ, ఆయనకు గోదావరి-కృష్ణా జలాలపై సరైన అవగాహన లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రగా అభివర్ణించారు. రైతుల భూములను ఎండగొట్టేందుకు కాళేశ్వరం ద్వారా నీటి నిల్వను అడ్డుకునే కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు. నాట్లకు.. నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చిన కేసీఆర్, ఓట్లకు.. ఓట్లకు మధ్య రైతుబంధు ఇస్తున్న రేవంత్ రెడ్డి రైతు సంక్షేమం కాదు, ఎన్నికల వ్యూహమే అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఎకరాకు రూ.25,000 ఇవ్వాల్సి ఉందని, ఇప్పటివరకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వారి నిజమైన ఉద్దేశాలు బహిర్గతమయ్యాయని అన్నారు. రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్‌లో ఉందన్న సంగతి కూడా తెలియదని విమర్శించారు. పాకాల, గణపురం, లక్నవరం రిజర్వాయర్లపై ఏపీ ఫిర్యాదు చేయడం కూడా కాంగ్రెస్ నాయకుల చిత్తశుద్ధిలేకపోవడానికే నిదర్శనమని చెప్పారు. కాళేశ్వరం కాల్వల్లో నీరు నిల్వ లేకపోవడంతో ఎస్ ఆర్ ఎస్ పి డీబీఎం 38 కాల్వ పూర్తిగా ఎండిపోయిందని, అదే కేసీఆర్ హయాంలో మే నెల ఎండలకైనా నీరు అందించామని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోలేని, ప్రజల అవసరాలను గౌరవించని రేవంత్ రెడ్డి, చంద్రబాబు ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నారు. వారి పాలనలో రాష్ట్ర ప్రజలు తమ హక్కులను కోల్పోతున్నారు” అని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాగూర్ల వెంకటేశ్వర్లు (రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్), ఉడతల సారంగపాణి, జోరిక రమేష్, తాళ్లపెళ్లి జనార్దన్ గౌడ్, నార్లగిరి రమేష్, పులి రజనీకాంత్, బండి రజనీ కుమార్, శోభన్ కుమార్, నయీముద్దీన్, సల్వాజి రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.






