అధికార పార్టీ నేతల మొరం మాఫియా.. గుప్తనిధుల వేటకు రహస్య తవ్వకాలు.!

by Bhanu |

మండల కేంద్రంలో పర్వతగిరి శివాలయం రోడ్డులో డంపింగ్ యార్డ్ పక్కన ప్రభుత్వ భూమిలో జెసిబి తో 15 ట్రాక్టర్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మూడు పూవులు ఆరు కాయలుగా అక్రమ మొరం దందాకు తెరలేపారు.

అధికార పార్టీ నేతల మొరం మాఫియా.. గుప్తనిధుల వేటకు రహస్య తవ్వకాలు.!
X

దిశ, పర్వతగిరి: మండల కేంద్రంలో పర్వతగిరి శివాలయం రోడ్డులో డంపింగ్ యార్డ్ పక్కన ప్రభుత్వ భూమిలో జెసిబి తో 15 ట్రాక్టర్లు పెట్టి అధికార పార్టీ నాయకులు మూడు పూవులు ఆరు కాయలుగా అక్రమ మొరం దందాకు తెరలేపారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్థానిక నేతల పేర్లు చెబుతూ మొరం దందా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ కార్యకర్తలు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను మండల కేంద్రానికి చెందిన ఓ బుడ్డర్ఖాన్ సమన్వయ పరుస్తూ.. రాజకీయ నాయకులు అధికారులు మాకు అండదండగా ఉన్నారని బాహటంగానే అందరి ముందు వారి పేర్లను ప్రస్తావిస్తూ ఉన్నారు. స్థానిక విలేకరులు ప్రభుత్వ భూమిలో అక్రమ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారని కవరేజ్ కోసం వెళ్లగా విలేకరులపై మూకుమ్మడి దాడికి సిద్ధమయ్యారు. మీ దిక్కున చోట చెప్పుకోండి మీ ఇష్టం ఉన్నది రాసుకోండి మొరం దందా మాత్రం ఆపేది లేదు అంటూ అధికార దర్పం చూపిస్తున్నారు. గతంలో రైతుల ను పోలీస్ స్టేషన్ లో పెట్టి పొలం నుండి దారిని తీసిన ఘనులే మళ్లీ మొరం దందా మొదలుపెట్టారు. ఒక్కొక్క ట్రాక్టర్ ట్రిప్పుకు 1500 రూపాయలకు అమ్ముతూ రైతుల పేర్లు చెబుతూ మొరం దందా కొనసాగిస్తున్నారు.

ఓవైపు మొరం దందా.. మరోవైపు గుప్తనిధుల వేట..

మొరం దందా వెనుక గుప్త నిధుల తవ్వకాలు పట్టపగలే చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. పురాతనమైన గ్రామం "ప్రతాపగిరి" ప్రస్తుత "పర్వతగిరి" కాకతీయ రాజుల అనవాళ్ళు, పాత దేవాలయాల గుర్తింపులు శిలా సంపదలు ఉండటంతో గుప్త నిధులు ఉంటాయని గతంలో గుప్త నిధుల వేటగాళ్లు పర్వతగిరి గుట్టల చుట్టు అనేక తవ్వకాలు చేసి క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు చాలానే ఇప్పటి అలాగే ఉన్నాయి. ఇప్పుడు.. గతంలో అధికార పార్టీకి చెందిన నేతలు ప్రస్తుత నేతలు కూడా వారి పందాలోనే తవ్వకాలకు వెళ్తున్నారని మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్య తీసుకుని అక్రమం మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని మొరం దందా తో పాటు గుప్తనిధుల వేట పై కూడా పూర్తి విచారణ చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు..

Next Story