- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాస్టర్ ప్లాన్‌లో కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని చేర్చకపోవడంపై దారుణం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్‌లో చేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

మాస్టర్ ప్లాన్‌లో కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని చేర్చకపోవడంపై దారుణం
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేర్వర్ రెడ్డి
దిశ, జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్‌లో చేర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలోని ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి కోసం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టిందని, కానీ ప్రతి ఏటా కొమురవెల్లి మల్లన్న ఖజానా నుంచి రూ.6 కోట్లు సీజీఎం రూపంలో సర్కారు పన్ను వసూలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లన్న దేవాలయాన్ని మాస్టర్ ప్లాన్‌లో చోటు ఇవ్వకపోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక గర్వకారణమైన ఈ పవిత్ర క్షేత్రాన్ని విస్మరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కోట్లాది భక్తులు దర్శనం కోసం వచ్చే ఈ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్‌లో చేర్చకుండా పక్కన పెట్టడం, భక్తుల మనోభావాలను అవమానపరచడమేనని అన్నారు. ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్‌లో తక్షణమే చేర్చాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే భక్తుల ఆగ్రహాన్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడుతుంది అని హెచ్చరించారు.






