ఓరుగల్లు ముద్ర ప్రతిబింబించేలా నిరుద్యోగ మార్చ్: రాకేష్ రెడ్డి

by Disha Web Desk 6 |
ఓరుగల్లు ముద్ర ప్రతిబింబించేలా నిరుద్యోగ మార్చ్: రాకేష్ రెడ్డి
X

దిశ కేయూ క్యాంపస్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి, చందుపట్ల కీర్తి రెడ్డి ఇతర ముఖ్య బీజేపీ నాయకులు వరంగల్లోని నిరుద్యోగ యువతను కలిసి భరోసా తెలిపారు. ఈనెల 15వ తేదీన నిర్వహించబోయే నిరుద్యోగ మార్చ్ విజయవంతం చేయాలని నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా..బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్, ఎంపీ బండి సంజయ్ కుమార్, డా.కె. లక్ష్మణ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ., డీకే. అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు.పాల్గొంటారని తెలిపారు.

వీరి ప్రధాన డిమాండ్ ..సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. లీకేజీ వల్ల నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లు గడ్డ కేంద్రంగా పురుడు పోసుకున్న ఏ ఒక్క ఉద్యమం కూడా ఓటమి చెందలేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే తమదంటూ ఒక ల్యాండ్ మార్క్ నమోదు చేశారని, దగా పడ్డ ఓరుగల్లు బిడ్డల పోరాట పటిమను ఎట్టి పరిస్థితుల్లో తక్కువగా అంచనా వేయొద్దని, వారి ఆలోచనలను అపహాస్యం చేయవద్దన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ కారణంగా సోయి తప్పిన పాలన వల్ల, గ్రూప్ పరీక్షల పేపర్ లీక్ కారణంగా.. తీవ్రంగా నష్టపోయిన 30 లక్షల నిరుద్యోగులకు అండగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "నిరుద్యోగ మార్చ్" కూడా ప్రభుత్వాన్ని గద్దె దించే ఒక ప్రజా ఉద్యమంగా మారడం ఖాయం అన్నారు. ఇది కేవలం నిరుద్యోగుల మార్చ్ కాదు, కొలువుల మీద ఆశలు లక్షలాది కుటుంబాలకు, నిరుద్యోగ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసానిచ్చేలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చురీకి పంపించేలా నిరుద్యోగ మార్చ్ ఉండబోతోందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని, పాలనను పోస్ట్ మార్టం చేసే కడుపు మండిన నిరుద్యోగుల గర్జన ఈ "నిరుద్యోగ మార్చ్" అని యువకులకు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా దగాపడ్డ నిరుద్యోగ యువకులంతా ఈ నెల 15 న ఓరుగల్లు చేరుకుని ఓరుగల్లు గడ్డ మీద జరిగే ఈ నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చెయ్యడం కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. నిరుద్యోగ మార్చ్ కమిటీ సభ్యులు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ, వీరేందర్ గౌడ్, దరువు ఎల్లన్న, పుల్లారావు యాదవ్ తెలిపారు.

Next Story

Most Viewed