వామ్మో ఆ స్టార్ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా.. సినిమాల్లోకి వచ్చాక ఆమె సంపాదించిన ఆస్తి చూస్తే దిమ్మ తిరగాల్సిందే!..

by Kavitha |
వామ్మో ఆ స్టార్ హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా.. సినిమాల్లోకి వచ్చాక ఆమె సంపాదించిన ఆస్తి చూస్తే దిమ్మ తిరగాల్సిందే!..
X

దిశ, సినిమా: ‘నేను శైలజ’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు అందుకున్నది. ఆ తర్వాత ‘మహానటి’ తో విమర్శకులను సైతం మెప్పించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని అన్ని భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామ సంపాదించిన ఆస్తుల పైన చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు కీర్తి ఆస్తి విలువ సుమారు రూ.41 కోట్లు అని సమాచారం. ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇది మాత్రమే కాకుండా ప్రకటనలు, టెలివిజన్ కార్యక్రమాలతో రాబడుతుంది.

అలాగే ప్రతి ఎండార్స్‌మెంట్‌కు INR 30 లక్షల వరకు వసూలు చేస్తుంది.

ఇన్ స్టాలో ప్రతి స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు రూ.25 లక్షలు తీసుకుంటుందట. చెన్నైలో విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. కీర్తి వద్ద 60 లక్షల విలువైన వోల్వో S90, INR 1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730Ld , INR 81 లక్షల ధర కలిగిన Mercedes Benz AMG GLC 43 , ఒక Toyota ఇన్నోవా కలిగి ఉంది.

Next Story

Most Viewed