హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం.. కుక్క ఇంట్లోకి వచ్చిందని భార్యాభర్తలపై దాడి

by Mahesh |   ( Updated:2024-05-16 04:47:45.0  )
హైదరాబాద్ మధురానగర్‌లో దారుణం.. కుక్క ఇంట్లోకి వచ్చిందని భార్యాభర్తలపై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. కుక్కు మా ఇంట్లోకి ఎందుకు వచ్చిందని ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవను మనసులో పెట్టుకున్న ధనుంజయ్ అదును చూసి తన స్నేహితులతో కలిసి.. శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డు అయింది. ఆ వీడియోలో ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. వారి అరుపులు విన్న స్థానికులు వేగంగా వచ్చి అడ్డుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story