పరకాల నియోజకవర్గ పూర్వ వైభవానికి అధికారులు సహకరించాలి..

by Disha Web Desk 20 |
పరకాల నియోజకవర్గ పూర్వ వైభవానికి అధికారులు సహకరించాలి..
X

దిశ, హనుమకొండ టౌన్ : పరకాల నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చించేందుకు సోమవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం జరిగినది. ఈ సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి పరకాల ప్రాంత చరిత్రను చెబుతూ ఈ ప్రాంతమునకు పూర్వ వైభవం తెచ్చేందుకు అందరూ వారి వారి శాఖల పరంగా సహకారం అందించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి యువత ద్వారానే సాధ్యమని యువతకు తగు శిక్షణ ఇచ్చి శిక్షణ ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి తగిన సలహాలు అవసరమైన చర్యలు తీసుకోవడానికి సూచనలు ఇవ్వవలసిందిగా అధికారులను ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి కోరారు.

యువత ఉద్యోగ ఉపాధి రంగాలు రాణించగలిగితే వారి కుటుంబాలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందుతాయని తద్వారా నియోజకవర్గ అభివృద్ధి శాఖ సాధ్యమని అన్నారు. అందుకు యువకులకు కావలసిన ఉపాధి అవకాశాలను పెంపొందించుటకు సాధ్యాసాధ్యాల పై అధికారులతో చర్చించి పలునిర్ణయాలు చేశారు. పోలీసు శాఖ నుండి ప్రతి గ్రామానికి 10 మంది యువకులను ఎంపిక చేసి మండలానికి కనీసం 100 మంది యువకులను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించేలా చర్యలు చేపట్టేందుకు తగిన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రతి డిపార్ట్మెంట్ వారి వారి శాఖలకు సంబంధించిన మెరుగైన ప్రణాళికతో చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు జిల్లా అధికారులతో మరోసారి తిరిగి డిసెంబర్ 21వ తేదీన సమావేశం నిర్వహించాలని ఆ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరయ్యేలా వారికి సమాచారం ఇచ్చ మెరుగైన ప్రణాళికతో నివేదికలను తీసుకొని రావలసినదిగా రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పరకాల నియోజకవర్గ పరిధిలోని పోలీస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed