HYD : మైనర్​బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష

by Disha Web Desk 4 |
HYD : మైనర్​బాలికపై లైంగిక దాడి.. నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష
X

దిశ, చార్మినార్​ : మైనర్​ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితునికి న్యాయస్థానం ఐదేళ్లు జైలు శిక్ష విధించిన సంఘటన ఛత్రినాక పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఛత్రినాక ఇన్​స్పెక్టర్ వి.శ్రీనివాస్​ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... సైదాబాద్​ అక్బర్​ బాగ్​కు చెందిన మొహమ్మద్​ ముజీబ్​ ఉర్​ రహమాన్​ (21) వృత్తి రిత్యా ఎలక్ట్రీషియన్​. మొహమ్మద్​ ముజీబ్​ ఉర్​ రహమాన్ 2021లో ఓ మైనర్​ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో ఛత్రినాక పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయ స్థానం మొహమ్మద్​ ముజీబ్​ ఉర్​ రహమాన్​కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. పదివేల జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో ఆరునెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని న్యాయ స్థానం తీర్పు ఇచ్చిందని ఛత్రినాక ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు.

Next Story

Most Viewed