Breaking: పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు కుట్ర: మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2024-05-21 12:48:35  IST  )

పిఠాపురం నియోజవర్గంలో అశేష ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పవన్‌ను ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Breaking: పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు కుట్ర: మాజీ ఎమ్మెల్యే వర్మ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం నియోజవర్గంలో అశేష ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న పవన్‌ను ఓడించేందుకు భారీ ఎత్తున అధికార పార్టీ కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన పిఠాపూరంలో మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధృవీకరించిందిని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని వర్మ, ఎస్పీ సతీష్ కుమార్‌ను కోరారు. నియోజవర్గంలో అన్ని వర్గాల ప్రజలు పవన్‌కు ఓటేసి జై కొట్టారని, వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిఠాపురంలో పోలింగ్‌ శాతం పెరగడం అధికార పార్టీకి మింగుడుపడటం లేదని వర్మ అన్నారు.

Read More : అనుభవంతో చెబుతున్నా.. ఆ పార్టీ చిత్తుగా ఓడిపోబోతోంది: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Next Story