ప్రేమ లేకపోతే సూసైడ్.. పెళ్లైతే డివోర్స్.. ఏంటీ ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్!

by Disha Web Desk 8 |
ప్రేమ లేకపోతే సూసైడ్.. పెళ్లైతే డివోర్స్.. ఏంటీ ఈ జనరేషన్ ప్రాబ్లమ్స్!
X

దిశ, ఫీచర్స్ : ఈ జనరేషన్ వారి మైండ్ సెట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో కూడా వారికే తెలియడం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ చాలా దారుణంగా తయారయ్యారు. ఎందుకంటే మనం ఉదయం లేస్తే చాలు ఎన్నో సంఘటనలు చూస్తూనే ఉంటున్నాము. కొందరు ప్రేమలో పడి, ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ దిశగా ఆలోచిస్తున్నారు. ఇంకొందరు చాలా త్వరగా పెళ్లి చేసుకోవడం కొన్ని రోజులకు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది. ఈ జనరేషన్ వారి ఆలోచనా ధోరణి ఇలా తయారు కావడానికి కారణాలు ఏమిటని ఎంతో మంది ఆలోచిస్తున్నారు. కానీ వీటికి సరైన సమాధానం మాత్రం ఇప్పటికీ దొరకడం లేదు. కాగా, కొందరి అభిప్రాయం ప్రకారం, ప్రేమ, డివోర్స్ అనేది ఈ జనరేషన్ వారిపై ఎక్కువ ప్రభావం చూపడానికి కారణాలు ఏంటో తెలిపారు. కాగా, అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

మానసికంగా ధృఢంగా లేకపోవడం : ఈ జనరేషన్ వారు మానసికంగా ధృఢంగా లేకపోవడం వలన కొందరు ప్రేమ విఫలం అవ్వడంతోనే చావే పరిష్కారంగా ఆలోచిస్తున్నారంటున్నారు కొందరు నిపుణులు. అంతే కాకుండా బలహీనమైన మనస్తత్వం వారిని ఆత్మహత్య వైపు మళ్లేలా చేస్తుందంట. ప్రేమించిన అమ్మాయితోనే లైఫ్ జర్నీ ఊహించుకోవడం దీని వలన తాను ఉండదు అనే ఆలోచన వారిని మానసికంగా కుంగిపోయేలా చేసి, అది ఆత్మహత్యకు కారణం అవుతుందని చెబుతున్నారు.

లైఫ్‌ను చాలా ఈజీగా తీసుకోవడం : ఇక పెళ్లి విషయంలో కూడా ఈ జనరేషన్ వారు పెద్దగా పట్టింపులు ఏం చూపడం లేదంటున్నారు నిపుణులు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకే నచ్చకపోతే ఎవరి లైఫ్ వారిదే అనే కోణంలో ఆలోచిస్తున్నారంట. అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ఇదే ఆలోచనాధోరణి ఉన్నట్లు తెలుస్తోంది.

యూత్‌పై సినిమాల ప్రభావం : ఇక ఈ జనరేషన్ వారిపై సినిమాల ప్రభావం చాలా అధికంగా ఉంటుందంట. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం ఎలా కామన్ అయిపోయిందో, కామన్ పీపుల్ కూడా అదే దారిలో వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.. కొన్ని చోట్ల ఇలా జరిగిన సంఘటనలు కూడా లేకపోలేదు అంటున్నారు. కాగా, ఏది ఏమైనప్పటికీ ఈ జనరేషన్ మైండ్ సెట్ కాస్త డిఫరెంట్ అని చెప్పాలి.


Read More : ఎక్కడ చూసినా విడాకుల ముచ్చటే.. కానీ ఈ విషయం మర్చిపోతున్నారా?

Next Story

Most Viewed