ప్ర‌భుత్వ జీసీసీ బంకుల్లో నో స్టాక్ బోర్డు

by Ratna Kumari |

మండలంలోని ముప్పనపల్లి గ్రామ పరిధిలోని బోర్ గూడెంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జిసిసి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లేకపోవడంతో కొరత తీవ్రరూపం దాల్చింది.

ప్ర‌భుత్వ జీసీసీ బంకుల్లో నో స్టాక్ బోర్డు
X

దిశ, కన్నాయిగూడెం : మండలంలోని ముప్పనపల్లి గ్రామ పరిధిలోని బోర్ గూడెంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ జీసీసీ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లేకపోవడంతో కొరత తీవ్రరూపం దాల్చింది. గత కొద్ది రోజులుగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ కొరతను ఆసరాగా చేసుకొని కొందరు బంకుల సమీపంలోని పలు కిరాణా దుకాణాల్లో బాటిళ్లలో పెట్రోల్ నిల్వ చేసి బహిరంగంగానే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ అక్రమ విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సరఫరా పునరుద్దరించి బ్లాక్ మార్కెట్ అధిక ధరలకు అమ్ముతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story