జైపూర్ కు జీడబ్ల్యూఎంసీ బృందం

by Elthuri vijay kumar |

స్టడీ టూర్ లో భాగంగా గ్రేటర్ మేయర్ కార్పొరేటర్ అధికారుల బృందం బుధవారం రాజస్థాన్ లోని జైపూర్ నగరానికి చేరుకుంది.

జైపూర్ కు జీడబ్ల్యూఎంసీ బృందం
X

జైపూర్ కు జీడబ్ల్యూఎంసీ బృందం

జైపూర్ అభివృద్ధి కార్యక్రమాలను వీడియో ద్వారా వివరణ

గ్రేటర్ లో చేపట్టిన శానిటేషన్ విధానాలను వివరించిన మేయర్ సుధారాణి

దిశ, వరంగల్ టౌన్ : స్టడీ టూర్ లో భాగంగా గ్రేటర్ మేయర్ కార్పొరేటర్ అధికారుల బృందం బుధవారం రాజస్థాన్ లోని జైపూర్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ను క్షేత్ర స్థాయిలో సందర్శించిన నేపద్యంలో జైపూర్ మేయర్ డా.సౌమ్య గుజార్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి కార్పొరేటర్ లు అధికారులకు జైపూర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వచ్ఛతాపై వారు అమలు చేస్తున్న విధానాలను వివరించారు. జైపూర్ మునిసిపల్ కార్పొరేషన్ స్వచ్ఛతలో 16వ ర్యాంక్ సాధించడం తో పాటు స్వచ్చతాహి సేవలో మొదటి ర్యాంకు సాధించడం వారు నిర్వహిస్తున్న ఎఫ్ఎస్టిపితో పాటు సుమారు వెయ్యి టన్నుల సామర్ధ్యం తో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్వహిస్తు దాని నుండి 12 మెగా వాట్ ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం,ఆర్ఎఫ్ డికి సంబంధించిన ప్లాంట్, సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ లు నిర్వహించడం 100 శాతం గృహాల నుండి తడి పొడి చెత్తను వేరుగా సేకరణ జరపడం ట్రాన్స్ ఫర్ స్టేషన్ లను నిర్వహించడం జరుగుతుందని ఇది పింక్ సిటీ మాత్రమే కాకుండా ప్లాంట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజా ప్రతినిధుల సహకారం అడ్మినిస్ట్రేషన్ బాగుందని, నగరంలో గోడల మీద నగరం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేలా పెయింటింగ్స్ వేయడం జరిగిందని, వాటి ద్వారా నగరం యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చునని, భవిష్యత్తులో మెరుగైన ర్యాంక్ సాధించేలా కృషి చేస్తామని ప్రధానికి వాగ్దానం చేయడం జరిగిందని ఆ దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతాయని,ప్రతి స్వచ్చ ఆటోకు జైపూర్ అభివృద్ధికి సంబంధించిన పాటను (ఆడియో)ను ప్రదర్శిస్తూ వారిలో ప్రేరణను కలిగిస్తూ చెత్త సేకరణను కొనసాగుతూ తడి పొడి చెత్త ను వేరుగా అందించేలా ప్రోత్సహిస్తు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా మన నగరానికి చెందిన కార్పొరేటర్లు అధికారులు లేవనెత్తిన పలు అనుమానాలకు (సమస్యలకు) అక్కడి అధికారులు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా వరంగల్ గ్రేటర్ నగర మేయర్ మాట్లాడుతూ జైపూర్ నగర మున్సిపాలిటీకి వరంగల్ మున్సిపాలిటీకి సారూప్యత ఉందని రెండు నగరాలు హెరిటేజ్ నగరాలుగా, యునెస్కో నుండి గుర్తింపు పొందాయని అన్నారు. వరంగల్ నగరం స్వచ్ఛతలో దూసుకుపోతోందని ఇటీవల ప్రకటించిన స్వచ్ఛతా ర్యాంక్ లో 22 వ ర్యాంక్ దక్కించుకుందని ప్రజల్లో స్వచ్ఛతా పట్ల చైతన్యం తీసుకురావడానికి అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో త్వరలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, బయో కంపోస్ట్ ప్లాంట్, సిబిజీ ప్లాంట్ ,బయో మిథనైజేషన్ ప్లాంట్ లు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ నగరం పై ప్రత్యేక దృష్టి సారించి నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రూ.4100 కోట్లు కేటాయించారని అట్టి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. జైపూర్ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు వరంగల్ నగరాన్ని సందర్శించాలని జైపూర్ మేయర్ డా. సౌమ్య గుజార్ ను కోరగా అందుకు సమ్మతించినట్లు వరంగల్ మేయర్ సుధారాణి తెలిపారు. అనంతరం జైపూర్ మేయర్ అధికారులు నగర మేయర్ తో పాటు కార్పొరేటర్ లు అధికారులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు.

Next Story