విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

by Bhanu |

వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటార్ కు వైర్లు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
X

దిశ, నల్లబెల్లి: వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటార్ కు వైర్లు తగిలిస్తుండగా విద్యుత్ షాక్ కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం దస్తగిరి పల్లి గ్రామానికి చెందిన మాందాటి లక్ష్మణ్ రెడ్డి (19) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వైర్లు తగిలిస్తుండగా, ప్రమాదవశాత్తు కాలికి విద్యుత్ వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.


లక్ష్మణ్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించినట్లు పోలీసులు తెలపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story