గ్రామీణ దుకాణాల ద్వారా విక్రయించేందుకు నాబార్డు సహకారం : డీడీఎం చంద్ర‌శేఖ‌ర్

by Nallavelli.Anjaneyulu |

వేలేరు మండల కేంద్రంలో నాబార్డ్, డీఆర్డీఏ శాఖల సహకారంతో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని నా బార్డ్ డీడీఎం చంద్ర‌శేఖ‌ర్, వేలేరు స‌ర్పంచ్, వేలేరు మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులు బిల్లా యాద‌గిరి ప్రారంభించారు.

గ్రామీణ దుకాణాల ద్వారా విక్రయించేందుకు నాబార్డు సహకారం : డీడీఎం చంద్ర‌శేఖ‌ర్
X

దిశ, ధర్మసాగర్ : వేలేరు మండల కేంద్రంలో నాబార్డ్, డీఆర్డీఏ శాఖల సహకారంతో మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాన్ని నా బార్డ్ డీడీఎం చంద్ర‌శేఖ‌ర్, వేలేరు స‌ర్పంచ్, వేలేరు మండ‌ల స‌ర్పంచ్ ల ఫోరం అధ్య‌క్షులు బిల్లా యాద‌గిరి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నాబార్డ్ డీడీఎం చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ మ‌హిళ‌లు స్వ‌యంగా త‌యారు చేసిన ప‌లు ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించేందుకు గ్రామ దుకాణాలు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యులు గ్రామీణ ఉత్ప‌త్తులైన హ‌స్త‌క‌ళ‌లు, చేనేత బ్యాగులు, దుస్తుల త‌యారీ, గ్రామీణ దుకాణాల ద్వారా విక్ర‌యించుకునే స‌దుపాయం క‌ల్పించారు. నా బార్డ్ డీడీఎం చంద్ర‌శేఖ‌ర్ కు వేలేరు స‌ర్పంచ్ యాద‌గిరి గ్రామంలో కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించాల్సిందిగా కోరారు. నాబార్డ్ స‌హాయంతో గ్రామానికి అభివృద్ధి ప‌నులు చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్డీఏ డీపీఎం రాజేంద్ర ప్ర‌సాద్, క‌త్తి సంప‌త్, కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీఎం అనిత‌, మండ‌ల మ‌హిళా స‌మైక్య అధ్య‌క్షురాలు రేణుక‌, ఉప స‌ర్పంచ్ శ్రీక‌ర్, వార్డు స‌భ్యులు సునీల్, ప్ర‌శాంత్, మ‌హిళా సంఘం నాయ‌కురాలు రాణి, రాజ‌మ్మ, విజ‌య‌ల‌క్ష్మీ, సుజాత పాల్గొన్నారు.

Next Story