- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కడియం ఇలాకాలో మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ మొట్ట మొదటి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత కూడా పెరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు

దిశ, ధర్మసాగర్ : నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ మొట్ట మొదటి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే బాధ్యత కూడా పెరిగిందని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడంతో ఘనపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డప్పు చప్పుల్లు, డిజే పాటలు, బాణాసంచా పేలుళ్ళ మధ్య జై కాంగ్రెస్ నినాదాలతో ఘనపూర్ పట్టణ కేంద్రం మారుమోగింది. చైర్మన్ గా 13వార్డు అభ్యర్థి తాటికొండ వినయ్ కుమార్, వైస్ చైర్మన్ గా ఎన్నికైన నీల రాజమ్మ ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను భారీ గజ మాలతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సత్కరించారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారితోనే అభివృద్ధి సాధ్యం అని నమ్మి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పడిన స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికలలో అత్యధిక స్థానాలలో విజయం సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఈ పదవులతో పాటు మున్సిపాలిటీ అభివృద్ధిపై మా బాధ్యత కూడా పెరిగిందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా ప్రతీ వార్డుకు 2కోట్ల అభివృద్ధి నిధులు తీసుకువచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అలాగే వార్డుకు 50ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తానని తెలిపారు. నూతనంగా గెలిచిన కౌన్సిలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. కౌన్సిలర్లు మీమీ వార్డులలో సమస్యలు గుర్తించాలని త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.






