- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoist letter : మావోయిస్టుల లేఖను ఖండించిన ములుగు ఎస్పీ
ములుగు జిల్లా(Mulugu District)లోని కర్రెగుట్టలపై బాంబులు(Bombs) పెట్టినట్లు మావోయిస్టులు మంగళవారం ఓ లేఖ(Maoist Letter) ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ములుగు జిల్లా(Mulugu District)లోని కర్రెగుట్టలపై బాంబులు(Bombs) పెట్టినట్లు మావోయిస్టులు మంగళవారం ఓ లేఖ(Maoist Letter) ద్వారా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై ములుగు ఎస్పీ శబరీష్(SP Shabarish) స్పందించారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, బాంబుల పేరుతో వారిని బెదిరించడం సమంజసం కాదన్నారు. ఆదివాసీల జీవనోపాధిని అడ్డుకోవడం నేరమని, దీనిపై వారికి శిక్ష పడక తప్పదన్నారు. మావోయిస్టుల బెదిరింపులకు ప్రజలెవరూ భయపడొద్దని, ములుగు పోలీసులు మీకు అండగా ఉంటారని ఎస్పీ హామీ ఇచ్చారు. మావోయిస్టులకు ఎవరైనా సహాయం అందిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ములుగు అటవీ పరిధిలో, కర్రెగుట్టల వద్ద కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశామని తెలిపారు. ఆదివాసుల క్షేమం కోసం పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తారని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు.






