బయ్యారంలో సినిమా సందడి.. హీరో మురళీ మోహన్ షూటింగ్ షురూ

by Batti.Sumithra |

సినిమా హీరో మురళీ మోహన్ షూటింగ్ కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోని జగ్గుతండా పంచాయతీలోని నిహా ఫంక్షన్ హాల్‌లో జరిగింది.

బయ్యారంలో సినిమా సందడి.. హీరో మురళీ మోహన్ షూటింగ్ షురూ
X

దిశ, బయ్యారం : సినిమా హీరో మురళీ మోహన్ షూటింగ్ కార్యక్రమం బుధవారం మండల కేంద్రంలోని జగ్గుతండా పంచాయతీలోని నిహా ఫంక్షన్ హాల్‌లో జరిగింది. సినిమా షూటింగ్‌లో ముస్లిం సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమా షూటింగ్ సన్నివేశాలు బయ్యారం మండలంలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఫారెస్ట్ ప్రాంతాలు, బయ్యారం పెద్ద చెరువు పరిసరాల్లో జరిగే అవకాశం ఉన్నట్లు సినిమా ప్రొడ్యూసర్, సిబ్బంది తెలిపారు. ఈ చిత్రంలో భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో ముస్లింలు, హిందువులు ఐక్యంగా ఎలా పోరాటం చేశారు అనే అంశంతో పాటు, నేటి పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీలు, హిందువుల మధ్య ఏర్పడిన విభేదాలను ప్రతిబింబించే సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.

Next Story