మిల్స్ కాలనీ ఎస్సై సస్పెండ్

by Batti.Sumithra |   (  Updated:2026-03-26 06:07:51  IST  )

గ్రేటర్ వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

మిల్స్ కాలనీ ఎస్సై సస్పెండ్
X

దిశ, వరంగల్ బ్యూరో: గ్రేటర్ వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎం. సురేష్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గొడవలు, కేసుల నమోదు విషయంలో నిర్లక్ష్యం, అలాగే కొన్ని కేసుల్లో అధికార పార్టీ నేతలకు మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఎస్సైను సస్పెండ్ చేశారు.

Next Story