మేదరి కులస్థులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..

by Elthuri vijay kumar |

-మేదరి కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలి.. -సబ్సిడీపై వెదురు బొంగులను అందించాలి -మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు గైని రమేష్

మేదరి కులస్థులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..
X

మేదరి కులస్థులకు సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి..

-మేదరి కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలి..

-సబ్సిడీపై వెదురు బొంగులను అందించాలి

-మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు గైని రమేష్

దిశ, భూపాలపల్లి : ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మేదరి సంఘం జిల్లా, అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేదరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇంచార్జ్ రేపాల నరసింహ రాములు హజరయ్యారు భూపాలపల్లి, కాటారంలలో నూతనంగా వెదురు డిపోలను ఏర్పాటు అయ్యేలా కృసి చేయాలని అధికారులను వినతి పత్రం ద్వారా కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు గైని రమేష్, ప్రధాన కార్యదర్శి పెద్ది పృధ్వీలు మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలల్లో మేదరి కులస్థులకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. జిల్లాలో గూడు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేయాలన్నారు. బీసీ వేల్ఫేర్ నుండి సబ్సిడీ రుణాలు అందించాలని, జిల్లా కేంద్రంలో మేదరి కులస్థులకు స్థలాన్ని మంజూరు చేసి కమ్యూనిటీ హల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వెదురు మొక్కలను ఎక్కువగా పెంచి మేదరి కులస్థులకు సబ్సిడీపై అందించాలని అన్నారు. వెదురు సౌలభ్యం లేక మేదరి కులస్థులు వృత్తిని నమ్ముకొని ఉన్నవారు అధిక ధరలకు అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల నుండి వెదురు బొంగులను రూ.150/- చొప్పున కొనుగోలు చేయడం జరుగుతుందని, దీంతో వెదురు సరఫరా చేస్తున్న వారికి బాగానే ఉన్న వృత్తిని నమ్ముకొని అధిక ధరలకు వెదురును కొనుగోలు చేయడం మూలంగా లాభం తక్కువ వస్తుందని అన్నారు. కావున ప్రభుత్వం మేదరి కులస్థులను గుర్తించి సబ్సిడీ ద్వారా వెదురు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్లాస్టిక్ వాడకం రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా వెదురు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రభుత్వం ప్రోత్స హించాలని, అందుకుగాను వెదురు వస్తువుల తయారీకి గాను జిల్లా కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సహకరించాలని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మేదరి కులస్థులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అటవీ జాతి గడ్డి మొక్క అయిన వెదురు బొంగులతో జీవనం సాగిస్తున్న మేదరి కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చేలా కృషి చేయాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మేదరి కులస్థులు ఎస్టీ, ఎస్సీ జాబితాలో ఉన్నారని అన్నారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బిసీ-ఏ జాబితాలో కొనసాగుతున్నారని తెలిపారు. దీంతో అన్ని రంగాలలో చాలా ఇబ్బందులు ఎదురుకోంటున్నారని అన్నారు. కావున తెలంగాణకు సమీపంలో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్లలో ఎస్సీ జాబితాలో మేదరి కులస్థులు కొనసాగుతున్నారని, అక్కడి వారితో తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి రక్తసంబంధాలు ఉన్నాయని అన్నారు. కావున పక్క రాష్ట్రాలలో ఉన్న విధంగా బిసీ-ఏ నుండి మార్చి ఎస్సీ లేదా ఎస్టీ ౦బితాలోకి మార్చాలని డిమాండ్ చేశారు. మండలాల మేదరి కుల సంఘ నాయకులు, కుల బంధువులు పాల్గొన్నారు.

Next Story