- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయ్యారంలో గ్యాస్ కోసం భారీ క్యూలైన్
by Batti.Sumithra |
బయ్యారం బస్టాండ్ సెంటర్ సమీపంలో శ్రీ రాజరాజేశ్వరి హెచ్పీ గ్యాస్ కార్యాలయం ఎదుట గ్యాస్ వినియోగదారులు భారీ ఎత్తున క్యూ లైన్ కట్టారు.

X
దిశ, బయ్యారం : మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో శ్రీ రాజరాజేశ్వరి హెచ్పీ గ్యాస్ ఎదుట మండలంలోని గ్యాస్ వినియోగదారులు భారీ ఎత్తున తమ సిలిండర్లు వెంటబెట్టుకొని క్యూ లైన్ కట్టారు. గత రెండు వారాలుగా పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ రావడంలో ఆలస్యం కావడంతో ప్రతి ఒక్కరికి వంట వినియోగం ఉండడంతో నిత్యావసర వస్తువైన హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వారం రోజులుగా గ్యాస్ వినియోగదారులు బుక్ చేసుకున్నా.. గ్యాస్ అందుబాటులోకి మండలంలో గ్యాస్ ఏజెన్సీ వారు సక్రమంగా సప్లై చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిత్యవసర వస్తువు అయిన హెచ్పీ గ్యాస్ బండలు పంపిణీ చేయాలని మండల స్థానికులు మహిళలు పెద్ద ఎత్తున కోరుతున్నారు.
Next Story






