కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలు

by Bhanu |

కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలు
X

దిశ, ధర్మసాగర్‌ : కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ స్టేషన్‌ ఘనపూర్‌ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య గులాబీ కండువా కప్పి కొత్తగా చేరిన నాయకులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్‌ తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు, కడియం శ్రీహరి నియంతృత్వ పరిపాలనను చూసి స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ ప్రజలు విసుగు చెందుతున్నారన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌ పాలనపై అసహనం వ్యక్తం చేస్తూన్నారని, తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిగా కేసీఆర్‌నే కోరుకుంటున్నారని, ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి బీఆర్‌ఎస్‌ పార్టీదే అని రాజయ్య అన్నారు.

Next Story