- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్పీ సమక్షంలో మావోయిస్టు సభ్యురాలు లొంగుబాటు
అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ ఇప్పటికైనా ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన నక్సల్స్ కు ఎలాంటి ప్రాణ ముప్పు ఉండదని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ ఇప్పటికైనా ప్రభుత్వానికి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన నక్సల్స్ కు ఎలాంటి ప్రాణ ముప్పు ఉండదని ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం మావోయిస్టు కమాండర్ విజ్జాలు అలియాస్ ఐతూ, మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సౌత్ బస్టర్ డివిజనల్ కమిటీ 9వ ప్లాటున్ సభ్యురాలు మీడియం రామే అలియాస్ రజిత ఎస్పీ ముందు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన “పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగి రండి” అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా పెద్ద మొత్తంలో నక్సల్స్ లొంగిపోయారని అన్నారు. లొంగిపోయిన నక్సల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ పునరావాస సదుపాయాలను కల్పిస్తుందని వివరించారు. ఇప్పటికైనా అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ లొంగిపోయి వారి కుటుంబ సభ్యులతో ఆనందమైన జీవనం గడపాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత పోలీసు అధికారులు పాల్గొన్నారు.






