మంత్రి బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు శుభాకాంక్షల వెల్లువ

by Disha Web Desk 20 |
మంత్రి బాధ్యతలు స్వీకరించిన సీతక్కకు శుభాకాంక్షల వెల్లువ
X

దిశ, మంగపేట : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన సీతక్కను మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, మండల పార్టీ అధ్యక్షులు మైల జయరాం రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు.

ఈ మేరకు గురువారం ఉదయం 10 గంటలకు సీతక్కను సచివాలయంలోని తన చాంబర్ లో కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిట్యాల పురుషోత్తం, జిల్లా కార్యదర్శి ఆకు పవన్, బీసీ సెల్ జిల్లా నాయకుడు గూడ బోయిన సురేష్, యూత్ జిల్లా నాయకులు నూకల రాజేష్ లు పాల్గొన్నారు.

Next Story