- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాతులను కాపాడేందుకు బావిలోకి దిగి వృద్ధుడు మృతి..
by Bhanu |
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బాతులు వ్యవసాయ బావిలో పడిపోవడంతో, వాటిని రక్షించేందుకు బావిలోకి దిగిన వృద్ధుడు అనుకోకుండా మృతి చెందాడు.

X
దిశ, గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బాతులు వ్యవసాయ బావిలో పడిపోవడంతో, వాటిని రక్షించేందుకు బావిలోకి దిగిన వృద్ధుడు అనుకోకుండా మృతి చెందాడు. ఈ ఘటనపై గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. అయోధ్యపురం గ్రామ శివారులో నివసించే జోగ కట్టయ్య (65) అనే వృద్ధుడు, తన బాతులు ఇంటికి సమీపంలోని వ్యవసాయ బావిలో పడిపోయిన విషయం గమనించాడు.
వాటిని బయటకు తీసేందుకు తాడు సహాయంతో బావిలోకి దిగాడు. అయితే, మళ్లీ తాడు అందకపోవడంతో లోపలే చిక్కుకుని, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుని భార్య రామక్క ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Next Story






