- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏజెన్సీలో మద్యం మాఫియా.. పట్టించుకోని అధికారులు
ఏజెన్సీ మండలాలు అయిన వాజేడు, వెంకటాపురం మండలాల్లో నూతనంగా జరిపిన టెండర్లలలో మద్యం షాపులు దక్కించుకున్న సిండికేట్ బ్యాచ్‌లు మద్యం ప్రియులను దోచుకునే పనిలో పడ్డారు.

దిశ, వెంకటాపురం(నూగూరు): ఏజెన్సీ మండలాలు అయిన వాజేడు, వెంకటాపురం మండలాల్లో నూతనంగా జరిపిన టెండర్లలలో మద్యం షాపులు దక్కించుకున్న సిండికేట్ బ్యాచ్‌లు మద్యం ప్రియులను దోచుకునే పనిలో పడ్డారు. అంతా సిండికేట్‌గా మారి రోజు లక్షల్లో వ్యాపారం నడుస్తున్న అధిక రేట్లకు అమ్మకాలు జరిపి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని మద్యం ప్రియులు వాపోతున్నారు. వాజేడు, వెంకటాపురంలో మొత్తం నాలుగు షాపులకు టెండర్లు నిర్వహించగా నూతనంగా దక్కించుకున్న వారు సిండికేట్ మారి షాపులో అడిగిన బ్రాండ్లు లేకుండా చేసి మొత్తం సరుకుని బెల్ట్ షాపులను తరలించడంతో పాటు వారిని ప్రోత్సహించి వారికి అధిక రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు.
విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..
మద్యం సిండికేట్ బ్యాచ్ అధికారులకి ముడుపుల ఆశ చూపించి కనీస నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా బెల్ట్ షాప్ లని ప్రోత్సహించి అమ్మకాలు జరిపే విధంగా చక్రం తిప్పుతున్నారు. ఒక్కో క్వాటర్ బాటిల్ పై 20 నుంచి 30 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. గ్రామాల్లో కిరాణా దుకాణల్లో బెల్ట్ దందా విచ్చలవిడిగా సాగుతుందని, విచ్చలవిడిగా మద్యం విక్రయల వలన తరుచు గ్రామాల్లో గొడవలు జరుగుతున్నాయని స్థానిక మహిళలు వాపోతున్నారు. అధికారులు స్పందించి విచ్చలవిడి అమ్మకాలను అడ్డుకోవాలని వేడుకుంటున్నారు. ఇటు వెంకటాపురం మండల కేంద్రంతో పాటు వాజేడు మండలం ముల్లకట్ట వద్ద నిర్వహిస్తున్న బెల్ట్ దుకాణాలు మినీ బార్లను తలపిస్తున్నాయి.
ఏజెన్సీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న బినామీలు సిండికేట్ గా మారి అధిక రేట్లకు అమ్మకాలు జరపడంతో పాటు, విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తుంటే ఇక్కడ ఏమి జరగడం లేదనే తీరుగా అధికారులు వ్యవరించడం ఇక్కడ కొస మెరుపు. కుతవేటు దూరంలో ఏటూరునాగారంలో అబ్కాకారి శాఖ ఉన్న నెలవారీ ముడుపుల కారణంగా తనిఖీలు చేయడం లేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. కొన్నిసార్లు ఉన్నతాధికారుల ఒత్తిడితో నామమాత్రపు తనిఖీలు, దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నట్లు తెలుస్తుంది.






