న్యాయవాద రక్షణ చట్టం తేవాలి.. ధర్నాకు తరలిన వరంగల్ న్యాయవాదులు..

by Disha Web Desk 20 |
న్యాయవాద రక్షణ చట్టం తేవాలి.. ధర్నాకు తరలిన వరంగల్ న్యాయవాదులు..
X

దిశ, హనుమకొండ టౌన్ : న్యాయవాదుల హక్కులు, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగే ధర్నాకు వరంగల్ జిల్లా న్యాయవాదులు తరలివెళ్లారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరుగు ధర్నాకు ఆ సంఘం జాతీయ నాయకులు, సీనియర్ న్యాయవాది సారంపెల్లి మధుసూధన్ రెడ్డి న్యాయకత్వంలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి న్యాయవాదులు తరలి వెళ్లారు. న్యాయవాదులందరికి హెల్త్ కార్డులు జారీ చేయాలని, హెల్త్ స్కీమ్ లో చెల్లిస్తున్న బీమా పరిమితిని ఐదు లక్షల వరకు పెంచాలని, హెల్త్ స్కీంలో మెటర్నెటిని కవరేజి చేయాలని, వయో పరిమితి నిమిత్తం లేకుండా హెల్త్ కార్డులు జారీ చేయాలని, హెల్త్ స్కీం ను న్యాయవాదుల తల్లితండ్రులకు కూడా వర్తింపచేయాలని, అన్నిజిల్లా కేంద్రాలలో ఉపప్రధాన హాస్పిటల్స్ ను నెట్వర్క్ లిస్ట్ లో చేర్చాలనే డిమాండ్ లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ జరిగిన ధర్నాకు వరంగల్ న్యాయవాదులు తరలి వెళ్లారు.

ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నాయకులు ఎన్నంశెట్టి వేణుగోపాల్ రావు, వరంగల్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యాక స్వామి, న్యాయవాదులు మర్రి రాజు, ఓదెలు యాదవ్, మాధం సంపత్, సాయిని నరేందర్, అంకెశ్వరపు రాజేంద్ర ప్రసాద్, వీరేష్, అనిల్, తులిసేగారి రాజబాపు, రాచకొండ ప్రవీణ్ కుమార్, చింత నిఖిల్ కుమార్, వేణురాజ్ యాదవ్, అరున్, రాజు, కమల్, వేముల రమేష్, సాంబయ్య, అశోక్, అనిల్, చిరంజీవి, కొండపాక శంకరాచారి, మహిళ న్యాయవాదులు బాగ్య, గడప రమాదేవి, సరిత, అనిత, పద్మ, ఎం. ప్రవీణ, ఆవుల వాణి తదితరులు ధర్నాకు వెళ్లిన వారిలో ఉన్నారు.

Next Story

Most Viewed