- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైకోర్టు జడ్జికి హైస్కూల్ విద్యార్థుల లేఖ..
by S Gopi |
మాకేమో పరీక్షలు సమీపిస్తున్నాయి.. తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయుల సమస్య మీ దగ్గర...Latest News

X
దిశ, నెల్లికుదురు: మాకేమో పరీక్షలు సమీపిస్తున్నాయి.. తెలుగు, హిందీ బోధించే ఉపాధ్యాయుల సమస్య మీ దగ్గర ఉందట వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. మండలంలోని మేచరాజుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ,10వ తరగతి విద్యార్థులు మంగళవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డులు రాశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 1 నుంచి తెలుగు హిందీ బోధించే ఉపాధ్యాయులు తమ పదోన్నతుల కోసం పోరాటంలో భాగంగా పాఠాలు చెప్పడం నిలిపివేశారు. వారి సమస్య కోర్టు పరిధిలో ఉన్నందున త్వరలో తమకు పరీక్షలు ఉన్నందున సంబంధిత సబ్జెక్టులలో తాము నష్టపోతామని.. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని జడ్జిని కోరుతూ ఉత్తరాలు రాసినట్లు తెలిపారు.
Next Story






