- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ అహంకార మాటలు తగ్గించుకోవాలి : మంత్రి సీతక్క
కేటీఆర్ తన అహంకార మాటలను తగ్గించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకుల పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, కేటీఆర్ తన అహంకార మాటలను తగ్గించుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీతక్క మాట్లాడుతూ తమ నాయకుడు రాహుల్ గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తమ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు వారి ఫాంహౌస్ లలో పండిన పంటలను అద్భుతంగా అమ్ముకున్నారని, రైతులను మాత్రం ఉరి వేసుకొనెలా చేసి దుష్ట పాలన, దుర్మార్గపు పాలన కేసిఆర్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్యాగాలు చేస్తూ దేశ ప్రగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో నాడు నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ గారి వరకు ఎన్నో త్యాగాలు చేశారని, ఫారెన్ లో చదువుకున్నాని చెప్పే కేటీఆర్ ఈ రకంగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పై అబద్దాలతో అక్కసు వెల్లగక్కుతున్న దుర్బుద్దీ కేటీఆర్ ది అని ఇతరులు చనిపోయేలా ప్రేరేపించే చరిత్ర వారిదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమాయకులు చనిపోతే వారిపై పార్టీ కండువాలు కప్పి రాజకీయం చేసిన నీఛ బుద్దీ బీఆర్ఎస్ నాయకులదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా రాకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలుగా అద్భుతంగా ధాన్యం సేకరణ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ బయటికి వస్తాడని. పేద ప్రజల సమస్యలను పట్టించుకోడని అన్నారు. మేడారం జాతర విషయంలో తప్పుడు కూతలు కూస్తున్నా కేటిఆర్ కు సమ్మక్క- సారలమ్మ ఆగ్రహంతో ఆగం కాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మాని నిజాలు తెలుసుకోవాలని.. లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవి చందర్, ములుగు మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపల్ చైర్మన్ చింత నిప్పుల చంద్రకళ పాల్గొన్నారు.






