విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గేదె మృతి

by Bhanu |

కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ తో గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గేదె మృతి
X

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ తో గేదె మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు కేతిరి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం తనకి చెందిన సుమారు రూ.30 వేల విలువగల గేదె రోజువారి రిత్యా మేతకి వెళ్లడం జరిగిందని, ఈ నేపథ్యంలో గేదె ఇంటికి రాలేదని చుట్టుపక్కల తిరగడంతో గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతి చెందింది.


విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తుపై పెట్టకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి ఉండడంతో గేదె మృతి చెందిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం అందజేయాలని వేడుకున్నారు. కాగా విద్యుత్ అధికారులను వివరణ కోరగా గతంలో ట్రాన్స్ పార్మర్ ఎత్తు బండ రాయి పై ఉందని, ప్రక్క రైతు తన వ్యవసాయ క్షేత్రంలో మట్టి పోయడంతో ట్రాన్స్ఫార్మర్ కిందికి అయిందని విద్యుత్ అధికారులు తెలిపారు.

Next Story