కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంది : ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

by Ratna Kumari |

కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప‌దేళ్ల పాటు తెలంగాణ‌ను దోచుకుతిన్నార‌ని ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుంది :  ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
X

దిశ, గీసుకొండ : కేసీఆర్ ప్ర‌భుత్వంలో ప‌దేళ్ల పాటు తెలంగాణ‌ను దోచుకుతిన్నార‌ని ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాశ్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ మహానగర పరిధిలోని 16 వ డివిజన్ జాన్ పాకలోని ఇంపీరియల్ రిసార్ట్ లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మైనార్టీ మహిళలకు 50 కుట్టు మిష‌న్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ మైనార్టీ మహిళల ఆర్థికాభి వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని అన్నారు. కోటి మందిని కోటీశ్వరులను చేయ‌డ‌మే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం అని అన్నారు. టెక్స్ టైల్ పార్కులో స్థానికులకే అవకాశాలు ఎక్కువగా వచ్చేలా చూస్తామని అన్నారు. కుట్టు మిషన్ ప్యాషన్ డిజైన్ లో మంచి పట్టు సాధించేలా డీఆర్డీఏ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కలెక్టర్ సత్యశారద నిధుల నుంచి మైనార్టీలకు ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయ‌డానికి కృషి చేయాల‌ని వాటికి తోడు సీఆర్ఆర్ నిధులు సమకూర్చడం జరుగుతుందని అన్నారు. పురపాలక ఎన్నికల వలన సంగెం మండలంలో ఏర్పాటు చేయాల్సిన‌ మహిళా కుట్టు మిషన్ కొంచం ఆలస్యం అయిందని త్వరలో ప్రారంభిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ టి.రమేష్, ఆర్డీవో సుమ, తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్, నాయకులు మహమ్మద్ ఇమ్రాన్ జానీ, 16 డివిజన్ అధ్యక్షులు దుపాకీ సంతోష్, ఎండి జానీ పాల్గొన్నారు.

Next Story