సమ్మక్క జాతర పనులు ప్రారంభించిన కడియం

by velandi.Saikiran |

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని సమ్మక్క–సారక్క జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో చేపట్టిన అభివృద్ధి పనులను మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు.

సమ్మక్క జాతర పనులు ప్రారంభించిన కడియం
X

దిశ, ధర్మసాగర్: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని సమ్మక్క–సారక్క జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించే ఉద్దేశంతో చేపట్టిన అభివృద్ధి పనులను మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. వేలేరు మండలం పీచర, చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి-కొండాపూర్, లింగంపల్లి, గార్లగడ్డ తండా-ఫతేపూర్, స్టేషన్ ఘనపూర్ మండలం జిట్టేగూడెం-తాటికొండ, ఇప్పగూడెంలలోని శ్రీ సమ్మక్క–సారక్క జాతరలకు వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనకు 89.50లక్షలతో చేపట్టిన త్రాగునీటి సరఫరా సౌకర్యాలను, అలాగే తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్యం, రోడ్ల మరమ్మతులు, హై మాస్ ఫ్లడ్ లైట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు.

ఈ సందర్బంగా అమ్మవార్లను దర్శించుకొని ఎత్తు బంగారం మొక్కును చెల్లించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..., భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించే శ్రీ సమ్మక్క–సారక్క జాతరలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జాతర నిర్వహణకు సంబంధించి త్రాగునీటి సరఫరా, విద్యుత్ ఏర్పాట్లు, మరుగుదొడ్లు, రహదారి మరమ్మత్తులు, లైటింగ్, పారిశుధ్య చర్యలు, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు వంటి అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపడుతున్నామని తెలిపారు.

Next Story