రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి..

by Bhanu |   (  Updated:2025-05-04 13:47:00  IST  )

జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద సాయంత్రం టాటా ఏసీ బైకును ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి..
X

దిశ,జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలోని కోమల్ల టోల్ ప్లాజా వద్ద సాయంత్రం టాటా ఏసీ బైకును ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి ముప్పిడి యాదగిరిని టాటా ఏసీ వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలు అయ్యాయి వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అందరితో కలిసి ఉండే యాదగిరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడికి ఇద్దరు కొడుకులు భార్య ఉన్నారు.సంఘటన స్థలానికి రఘునాథపల్లి ఎస్ ఐ నరేశ్ యాదవ్ చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.




Next Story