ఈజీఎస్‌లో అవకతవకలు బహిర్గతం

by Elthuri vijay kumar |

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పనుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.

ఈజీఎస్‌లో అవకతవకలు బహిర్గతం
X

ఈజీఎస్‌లో అవకతవకలు బహిర్గతం

– రూ.2.48 లక్షల రికవరీకి ఆదేశాలు...

దిశ తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని జాతీయ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) పనుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. మండల పరిధిలోని 29 గ్రామాల్లో 16 పనుల్లో జరిగిన లోపాలపై విచారణ జరిపిన అధికారులు, సుమారు రూ.2,48,719 రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదనా రాజ్ మాట్లాడుతూ, నిధుల వినియోగంలో లోపాలు, పనుల అమలు విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు తేలిందని తెలిపారు. సంబంధిత సిబ్బంది, లబ్ధిదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పీడీ, ఇకపై ఈజీఎస్ పనుల్లో పారదర్శకత పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు...

Next Story