- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పొందాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత తమ నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రజా పాలన-పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల్లో ఈ నెల 1 నుండి 12వరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ, ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖల సమన్వయంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు. పలు ప్రతిష్టాత్మక సంస్థలు పాల్గొని అభ్యర్థులకు విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి.
ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు https://satg.telangana.gov.in/prajapalana/ వెబ్‌సైట్‌లో లేదా సంబంధిత క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా యువత కోసం ఈ నెల 8న వరంగల్ పట్టణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులు కూడా అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.






