- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని దేవన్నపేట శివారులో అక్రమ వెంచర్ ఏర్పాటు కలకలం రేపుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్కడ ప్లాట్లను గుణింతంగా విక్రయిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా వినిపిస్తున్న సమాచారంతో, ఓ ప్రైవేట్ వ్యాపార వేత్త దేవన్నపేట చివరనున్న వ్యవసాయ భూములను విడగొట్టి ప్లాట్లుగా మార్చి అమ్మకాలు చేపట్టినట్టు తెలుస్తోంది. రెవెన్యూ శాఖ నుంచి ఏ విధమైన లేఅవుట్ అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఇంటి నిర్మాణానికి ఇబ్బందికి దారి తీయవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పరిశీలన లేకుండాపోయిందని, ప్రభుత్వ భూములపై అక్రమంగా వెంచర్ ఏర్పాట్ల పనులు కొనసాగుతున్న కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






