అక్ర‌మ టోల్ టాక్స్ ర‌ద్దు చేయాలి : ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్య‌క్షులు

by Ratna Kumari |

మండలంలోని బోర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్యలో ఉన్న మానేరు చలివాగులో అక్రమార్కులు టోల్ టాక్స్ పేరిట అక్రమ వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని MRPS జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు

అక్ర‌మ టోల్ టాక్స్ ర‌ద్దు చేయాలి : ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్య‌క్షులు
X

దిశ, టేకుమట్ల : మండలంలోని బోర్నపల్లి-కిష్టంపేట గ్రామాల మధ్యలో ఉన్న మానేరు చలివాగులో అక్రమార్కులు టోల్ టాక్స్ పేరిట అక్రమ వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని MRPS జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా మానేరు చలివాగులో మట్టి రోడ్డు నిర్మాణం చేసి ప్రయాణం చేసే వాహనానికి ఒక రేటు వారే నిర్ణయించుకుని, టోల్ టాక్స్ పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని.. అడిగిన వారిని ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తూన్నారని తెలిపారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ టోల్ టాక్స్ వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Next Story