నీరుకుళ్ళ ఇళ్ల పట్టాలలో భారీ అవకతవకలు

by Ratna Kumari |

హనుమకొండ జిల్లా ఆత్మ కూర్ మండలం నీరుకుళ్ళ గ్రామంలో నిరుపేదల ఇళ్ల స్థలాల వ్యవహారంలో భారీ అవకతవకలు చేసుకుంటున్నాయి.

నీరుకుళ్ళ ఇళ్ల పట్టాలలో భారీ అవకతవకలు
X
దిశ, ఆత్మకూర్ : హనుమకొండ జిల్లా ఆత్మ కూర్ మండలం నీరుకుళ్ళ గ్రామంలో నిరుపేదల ఇళ్ల స్థలాల వ్యవహారంలో భారీ అవకతవకలు చేసుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వం అన్ని అర్హతలను పరిశీలించి చట్టబద్ధంగా పేదలకు పంపిణీ చేసిన ఫ్లాట్లలో ప్రస్తుత అధికారులు రాజకీయ నాయకులు కలిసి ఇష్టారాజ్యంగా మార్పులు చేస్తుండటం పై స్థానికంగా దుమారం రేగుతుంది. పాత లబ్ధిదారుల స్థలాల నుంచి కొంత భాగాన్ని అక్రమంగా తొలగించి కొత్త వారికి కట్టబెట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల వెనుక పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

నిబంధనలు గాలికి..

నిబంధనల ప్రకారం ఒకసారి కేటాయించిన ప్లాట్ సైజును మార్చాలన్నా లేదా తొలగించాలన్న ముందస్తుగా లబ్ధిదారునికి షోకాజు నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవడం తప్పనిసరి. కానీ నోటీసులు ఇవ్వకుండా పాత లబ్ధిదారుల అనుమతి లేకుండా ప్లాట్ల సరిహద్దుల ను మార్చడం పూర్తిగా చట్ట విరుద్ధం. పాత వారి స్థలాన్ని లాక్కొని కొత్త వారికి ఇవ్వడం ఏరకంగా సమంజసం కాదని బాధితులు గ్రామ ప్రజలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ప్రమేయంతోనే అక్రమాలు....

స్థానిక ఎమ్మెల్యే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోయిన కొందరు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఈ అవకతవకలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. తమ రాజకీయ అనుచరులను కొత్తవారిని ప్రసన్నం చేయడం కోసం దశబ్దాలుగా ఇల్లస్థలాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల నోరు కొడుతున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ అక్రమాలపై నోరు విప్పితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయోనని పేద ప్రజలు లబ్ధిదారులు భయపడుతున్నారు.

Next Story