- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
by Ratna Kumari |
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా కాలిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

X
దిశ, నల్లబెల్లి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా కాలిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన పేరాల పెద్ద సమ్మయ్య ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులకు వెళ్లినట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రాంతంలో ఇంట్లో నుంచి మంటలు వస్తున్నాయని స్థానికులు గమనించి సహాయక చర్యలు చేస్తున్న క్షణాల వ్యవధిలోనే మంటలు ఇల్లు అంతా వ్యాపించడంతో లోపల ఉన్న 10 క్వింటాళ్ల పత్తి, ఫర్నిచర్, బట్టలు, నగదుతో సహా మొత్తం సామాగ్రి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ప్రభుత్వం సమ్మె కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ఓరుగంటి రాజు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయి ప్రసన్నకుమార్ తెలిపారు.
Next Story






