హాస్టల్ బియ్యం పక్కదారి

by Elthuri vijay kumar |

బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న 12 క్వింటాళ్ల సన్న బియ్యం పట్టివేత

హాస్టల్ బియ్యం పక్కదారి
X

హాస్టల్ బియ్యం పక్కదారి

బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న 12 క్వింటాళ్ల సన్న బియ్యం పట్టివేత

కేసు నమోదు చేసిన పోలీసులు

దిశ, పరకాల : రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలనే సంకల్పంతో సన్న బియ్యంను హాస్టళ్లకు అందిస్తున్న క్రమంలో హాస్టల్ వార్డెన్లు హాస్ట‌ల్ విద్యార్థుల‌కు నాణ్య‌మైన ఆహారాన్ని అందించకుండా ప్రభుత్వ సంకల్పాన్ని నిర్వీర్యం చేసేవిధంగా తప్పుడు లెక్కలతో సన్నబియాన్ని తప్పుదారి పట్టిస్తూ అక్రమంగా మార్కెట్లో అమ్ముతూ ధనార్జునే ద్యేయంగా చలామణి అవుతున్న సంఘటన గురువారం పరకాల పట్టణంలోని బీసీ హాస్టల్ లో జరిగింది. ఈ విషయం స్థానికులు సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం చేరవేయగా. స్పందించిన అధికారులు అక్రమంగా 12 క్వింటాళ్ల సన్నబియ్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తరలిస్తుండగా అట్టి బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సంబంధిత అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. వారి సమాచారం మేరకు విద్యార్థులకు అందవలసిన పన్నెండు క్వింటాళ్ల సన్న బియ్యాన్ని స్థానిక బీసీ హాస్టల్ వార్డెన్ అందె రవి ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ గుట్టు చప్పుడు కాకుండా అమ్ముకుంటున్న తీరు పలువురిని ఆశ్చర్యపడేలా చేసిందని వాపోయారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు లు కేసు నమోదు చేసి పంచనామా చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

Next Story