- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా నాటుసార ముడి పదార్థాల పట్టివేత
by Ratna Kumari |
వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నాటుసార ముడి సరుకును పెద్ద మొత్తంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో నాటుసార ముడి సరుకును పెద్ద మొత్తంలో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నియోజక వర్గంలో నాటుసారా నియంత్రణ కోసం ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత దాడులు చేపడుతున్నారు. ముడి సరుకు రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం దగ్గరలో వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ టాటా విస్టా కారులో తనిఖీలు చేశారు. అందులో 300 కిలోల పటిక, 100 కేజీల బెల్లం, ఐదు లీటర్ల నాటుసారను గుర్తించారు. ముడి సరుకును, టాటా విస్టా వాహనం సహా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై శార్వాణి సహా సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






