ఏజెన్సీ హెచ్.ఎం లకు ఝలక్..! ఏడుగురికి షోకాజ్‌ నోటీసులు

by Bhanu |   (  Updated:2025-07-15 08:37:56  IST  )

ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఝలక్ ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల

ఏజెన్సీ హెచ్.ఎం లకు ఝలక్..! ఏడుగురికి షోకాజ్‌ నోటీసులు
X

దిశ, కొత్తగూడ : ఏజెన్సీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఝలక్ ఇచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్తగూడ మండలానికి చెందిన ఐదుగురు,గంగారం మండలానికి చెందిన ఇద్దరు మొత్తం ఏడుగురు ప్రధానోపాధ్యాయులకు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రవీందర్ రెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. వారి పనితీరుపై వివరణ ఇవ్వాలంటూ అధికారిక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కొత్తగూడ మండల కేంద్రంలో మండల విద్య శాఖ అధికారి గుమ్మడి లక్ష్మినారాయణ ఓ ప్రకటనలో మాట్లాడుతూ.. పాఠశాలలలో పేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా విద్యార్థుల హాజరును నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తించారు.


ఉదయం 10 గంటల సమీక్షలో స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ, సాయంత్రం 4:30 వరకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.పీ.యూ.పీ.ఎస్ గోపాలపురం, మాసంపల్లి,కార్లాయి,దుర్గారం,ఆదిలక్ష్మీపురం, గంగారం మండలంలో బావురుగొండ,తల్లాగుంపుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా విద్య శాఖ అధికారి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు లెక్కలే భవిష్యత్‌కు ఆధారాలని అన్నారు. వాటిలో అలసత్వం తగదన్నారు. డిజిటల్ పద్ధతుల్లో అంకిత భావంతో వ్యవహరించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వెంటనే రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించి షోకాజ్‌ నోటీసులు జరిచేశారు.

మండలంలోని మిగతా పాఠశాలల్లో టెన్షన్ వాతావరణం..!

ఈ చర్యలతో కొత్తగూడ మండలంలోని మిగతా పాఠశాలల్లో సైతం అప్రమత్తత పెరిగింది. ఎప్పుడైనా తనిఖీలు రావచ్చన్న ఉత్కంఠ నెలకొంది. సి.ఆర్.పి లు డీఈఓ కార్యాలయం నుంచి ఆదేశాలపై ఒక్క నిమిషం ఆలస్యం చేసినా ప్రశ్నించే స్థితి వచ్చిందన్న చర్చ టీచర్లలో జరుగుతోంది.

Next Story