అధికారుల మౌనమే మోసానికి అంగీకారమా..?

by Bhanu |

రేషన్ బియ్యంలో జరుగుతున్న మోసాలపై స్పష్టమైన ఆధారాలు బయటపడినప్పటికీ, సంబంధిత అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

అధికారుల మౌనమే మోసానికి అంగీకారమా..?
X

దిశ, హనుమకొండ : రేషన్ బియ్యంలో జరుగుతున్న మోసాలపై స్పష్టమైన ఆధారాలు బయటపడినప్పటికీ, సంబంధిత అధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. కార్డుదారులు ధైర్యంగా తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పి, డీలర్‌ను నిలదీసిన తర్వాత కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధితులను మరింత ఆందోళన లోకి నెట్టింది. ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ప్రజల జీవనాధారంగా మారిన ఈ సమయంలో, అవి న్యాయంగా అందకుండా మోసం జరిగితే, వెంటనే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ అక్కడి అధికారులు డీలర్‌కు అండగా వ్యవహరిస్తున్నారన్న భావన స్థానికుల్లో పెరుగుతోంది.

మోసానికి అడ్డుకట్ట వేయాల్సిన వారు… మూలంగా మారారా..?

డీలర్ క్లియర్లీ రికార్డుల్లో తప్పుడు సమాచారం నమోదు చేసి, ప్రజలకు తక్కువ బియ్యం ఇచ్చాడన్న ఆరోపణలపై విచారణ జరపకుండా, విషయం అలానే వదిలేయడం అనుమానాస్పదం. ప్రభుత్వ పథకాల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరించే అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల నమ్మకానికి బీడు పడుతుంది..

ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలయ్యేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఒక్క డీలర్ తప్పు మాఫీచేయదగ్గది కాదు. పైగా అది గుర్తించిన తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థపైనే అనుమానాలు తలెత్తుతాయి. పథకాల్ని ప్రజల వరంగా మార్చాలంటే అధికార వ్యవస్థ నిర్భయంగా, పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం చేయడం, మోసపూరిత ప్రవర్తనకు పాల్పడిన డీలర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోవడమే ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అవుతుంది.


Next Story