- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్‌కు రూ.1 లక్ష డొనేషన్
వరంగల్ ఎన్ఐటీ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి వరంగల్ కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

దిశ, హనుమకొండ : వరంగల్ ఎన్ఐటీ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి వరంగల్ కుడా ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఇనగాల చారిటబుల్ ట్రస్టు ద్వారా పీ ఎం, టిబి ముక్త్ భారత్ అభియాన్ కింద వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రతి నెలా 18 మంది టిబి రోగులకు ఏడాది పాటు సహాయం అందించేందుకు రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు) డొనేషన్ చెక్కును రాష్ట్ర గవర్నర్ ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, రెడ్ క్రాస్ రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు, టీపీసీసీ సెక్రటరీ ఇ.వి. శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ సంధ్యరాని, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి అందరూ గవర్నర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ డొనేషన్ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యతపై ఇనగాల ట్రస్టు చూపిన కృషికి ప్రశంసలు వెల్లువెత్తాయి.






