- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సరస్వతీమాతగా దర్శనమిస్తున్న భద్రకాళి దేవి
సరస్వతీ మాతగా అలంకరింపబడిన అమ్మవారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు

దిశ, హన్మకొండ టౌన్ : చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరత్ర మహోత్సవములు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఎనిమిదవ రోజు కార్యక్రమాలలో భాగంగా అమ్మవారిని సరస్వతీమాతగా అలంకరించి పూజారాధనలు జరిపారు. సరస్వతీ మాతగా అలంకరింపబడిన అమ్మవారి దర్శనం వల్ల సాధకుడికి సకల విద్యలు సమకూరుతాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ రోజు అమ్మవారికి ఉదయం భద్రపీఠ సేవ సాయంకాలం అశ్వవాహన సేవ నిర్వహించారు.
రేపు భద్రకాళి అమ్మవారి జాన్మోత్సవం. దుర్గ భద్రకాళిగా కోటి యోగిని గణములతో ప్రాదుర్భావం చెందిన రోజు. బతుకమ్మ కూడా దుర్గాస్టామినాడే జన్మించిందని ఆనాడే చద్దులు చేయడమనేది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ రోజు కార్యక్రమాలకు రవిశంకర్ మానస, సుధీర్ రెడ్డి అర్పిత దంపతులు ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఉబయ దాతలకు పూజానంతరం అమ్మవారి శేషవస్త్రములు బహుకరించి ప్రసాదములు ఆందజేశారు. అనంతరం సాయంకాలం ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతో అలరించాయి.






