వీధి కుక్కల దాడిలో మేకలు మృతి..

by Kodari Anjali |

వీధి కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.

వీధి కుక్కల దాడిలో మేకలు మృతి..
X

దిశ, పెద్దవంగర: వీధి కుక్కల దాడిలో రెండు మేకలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు ఆవుల రమేష్ స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల రమేష్ శుక్రవారం ఉదయం పొలం పనులకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి వద్దనున్న రెండు మేకలపై వీధి కుక్కలు దాడి చేయడంతో అవి తీవ్రమైన గాయాలతో మృతి చెందాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమికొట్టిన మూగ జీవాలు అప్పటికే ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఘటన వల్ల తనకు సుమారుగా 15 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సంబంధిత అధికారులు స్పందించి తనకు తగిన నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story