- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గీసుగొండలో మహిళ దారుణ హత్య..
by Bhanu |
గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.

X
దిశ, గీసుగొండ : గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ వివరాల ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన స్వరూప(65)కు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కూతుర్లకు వివాహం కాగా అత్తవారింటిలో ఉంటున్నారు. కొడుకు హన్మకొండలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. స్వరూప స్వగ్రామంలో ఉంటోంది. ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు స్వరూప ఇంట్లోకి చొరబడి తలపై కొట్టి హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






