గీసుగొండలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన బొలెరో

by Bhanu |

కుటుంబ సభ్యులతో కలిసి కారులో శుభకార్యానికి వెళ్తున్న వారిని మిర్చి లోడుతో వస్తున్న బొలెరో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు.

గీసుగొండలో రోడ్డు ప్రమాదం.. కారును ఢీ కొట్టిన బొలెరో
X

దిశ, గీసుగొండ : కుటుంబ సభ్యులతో కలిసి కారులో శుభకార్యానికి వెళ్తున్న వారిని మిర్చి లోడుతో వస్తున్న బొలెరో ఢీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వరంగల్ నుండి నర్సంపేట వైపు వెళ్తున్న కారును, గీసుగొండ మండలంలోని సింగ్యా తండా వద్ద మిర్చి లోడుతో వస్తున్న బొలెరో అదుపుతప్పి ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

క్షతఘాత్రులను స్థానికులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారిది మామలూరు మండలం తిమ్మంపేట గ్రామస్తులుగా తెలిసింది. బొలెరో డ్రైవర్ పరారీ లో ఉన్నాడు. ఇంకా పూర్తి వివరాలకై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



Next Story