ఆలేరులో తాటి చెట్టు పై నుంచి పడి గీతా కార్మికుడు మృతి

by Bhanu |

తాటిచెట్టు పైన నుంచి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో చోటు చేసుకుంది.

ఆలేరులో తాటి చెట్టు పై నుంచి పడి గీతా కార్మికుడు మృతి
X

దిశ, నెల్లికుదురు: తాటిచెట్టు పైన నుంచి పడి గీతా కార్మికుడు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన చీకటి ప్రభాకర్ గౌడ్(48) యధావిధిగా తాటి చెట్టు నుంచి కల్లు తీయడానికి ఆదివారం మధ్యాహ్నం తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య నరసమ్మ, ఓ కుమారుడు,ఇద్దరు కూతుర్లు ఉన్నారు.కాగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసుకొని పార్తివదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పేదరికంలో ఉన్న ప్రభాకర్ గౌడ్ ఆకస్మిక కన్నుమూతతో కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కు కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర కష్టాలలో కూ రుకు పోయినట్లయింది.సంబంధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు గీతా కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Next Story