- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి
by Bhanu |
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ,రాయపర్తి : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం నాల్లం యాదగిరి (57) శనివారం రోజు సాయంత్రం గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడ్డాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యాదగిరి ఆదివారం రోజు మధ్యాహ్నం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. యాదగిరి భార్య మనెమ్మ ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై కొంగ శ్రవణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






