- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గల్లీ గల్లీలో గంజాయి.. ఎనీ టైం ఎంజాయ్
నేటి యువతే దేశానికి పట్టు కొమ్మలంటారు పెద్దలు. అలాంటి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న వయసులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

దిశ, కాటారం : నేటి యువతే దేశానికి పట్టు కొమ్మలంటారు పెద్దలు. అలాంటి యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న వయసులోనే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో యువత గంజాయికి బానిసలై వారి భవిష్యత్తును బలి చేసుకుంటున్నారు, దీంతో యువత మత్తుకు బానిసై, వారి భవిత ప్రశ్నార్థకంగా మారనుందని పలువురినుండి పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి, మండల కేంద్రంతో పాటు చుట్టుప్రక్కల గల ఆయా ప్రాంతాల్లో ఎంతో మంది గంజాయికి అలవాటు పడుతున్నా అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
సిగరెట్లు గంజాయి పొడి నింపుకొని..
గంజాయికి అలవాటు పడ్డ యువకులు ఆ మత్తులో వారేం చేస్తున్నారో వారికే అర్ధం కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా వాడితే అనుమానం కలుగుతుందని వ్యసన పరులు సిగరెట్పొడిని తీసేసి దాంట్లో గంజాయి పొడిని నింపుకొని ధర్జాగా వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ తరహా ఉపాయాన్ని కాటారం మండల కేంద్రంలో అత్యధికంగా ప్రయోగిస్తున్నారు.
గ్రామ చివరి ప్రాంతాలే రహస్య అడ్డాలు
గ్రామాల్లో యువకులు రహస్య ప్రదేశాలకు వెళ్లి గుంపులుగా ఓ చోట చేరి గంజాయి సిగరెట్లు తాగి మత్తుకు లోనవుతున్నారు. యువకులు, మైనర్లు కూడా అలవాటు పడుతున్నారు. అసలు గంజాయి ఎక్కడి నుంచి సరాఫరా అవుతుంది, ఎవరు తీసుకొస్తున్నారు, స్థానికంగా ఎవరు విక్రయిస్తున్నారు, అనే దానిపై లోతుగా విచారణ చేయాల్సి ఉంది. పలు చోట్ల బెల్ట్ షాప్ లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం..!
గంజాయి మత్తులో తూగుతూ తల్లిదండ్రులపై భౌతిక దాడులు
చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, కూలీ నాలిచేసుకుంటూ రూపాయి రూపాయి పొదుపు చేసి తమ పిల్లలకు చదువుల నిమిత్తం ఖర్చు చేస్తుంటే తమ పిల్లలు గంజాయి కు బానిసలై గంజాయి మత్తులో తూగుతూ తమపైనే భౌతిక దాడులకు దిగడమే కాకుండా గొడవలకు వెనకాడకుండా తమ పెంపక తీరుపై పలువురు మండిపడుతూ తమకు తల వంపులు తెస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కనీసం ఇంట్లో తల్లిదండ్రులు మాట కూడా వినకుండా పెడచెవున పెడుతూ గంజాయి మత్తుకు ఊగిపోతున్నారని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు, ఎన్నో ఆశలు పెట్టుకుని ఊహల్లో ఊగిపోయే తమకు చెడుమార్గం వైపు అడుగులు పెడుతున్న తమపిల్ల ల్ని చూసి తలలు పట్టుకుంటున్నామని కన్నీరు పెడుతున్నారు. గత కొన్ని నెలల నుండి ప్రతి గ్రామంలో గంజాయి కు బానిసలు అవుతూ పలు కుటుంబాల ఆర్ధిక ఇబ్బందులు రోడ్డున పడేస్తున్నా యని కనీసం తమ పిల్లలను కూడా కాపాడుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. నిషేధిత గంజాయి విక్రయించే వారిపై సంబంధిత అధికారులు నిఘా ఏర్పాటు చేసి పట్టుకొని కఠినంగా శిక్షించాలని గం జాయి భారీ నుండి తమ పిల్లల్ని కాపాడాలని కొందరు తల్లిదండ్రులు చేతులెత్తి మొక్కుతున్నారు.
పర్యవేక్షణ లోపమే కారణం
పోలీసు వ్యవస్థ ఇంతపటిష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు వారికి స్థానికులెవరు మీడియేటర్లుగా ఉన్నారెన్న వివరాలు ఎందుకు పోలీసులు పసిగట్టలేకపోతున్నారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్షపరోక్షంగా అందరిసహకారంతోనే గంజాయి ఇంత విచ్చలవిడిగా చలామనీ అవుతోందనే స్థానికంగా పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.
గ్రామాల్లో పోలీసులు నిఘా పెట్టాలి
గంజాయిని అరికట్టేందుకు పోలీసులు, ఎక్సెజ్ శాఖ గ్రామాలపై నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో ఎక్కువ మంది గంజాయికి బానిసలుగా మారారని, గ్రామాలలో గంజాయి సరఫరా చేసే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గంజాయి వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాలను వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కాటారం మండల ప్రజలు కోరుతున్నారు.






